News February 12, 2026
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్‌సిగ్నల్!

ఎయిర్‌ఫోర్స్ బలోపేతమే లక్ష్యంగా భారత్ రూ.3.25 లక్షల కోట్లతో 114 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌కు రాజ్‌నాథ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇండియాకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని సమాచారం. కాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫేల్ సత్తా చాటిన విషయం తెలిసిందే.
Similar News
News April 16, 2026
బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>
News April 16, 2026
ప్రపంచంలోనే అతిపొడవైన ముక్కు ఈయనదే!

18వ శతాబ్దానికి చెందిన బ్రిటిష్ సర్కస్ కళాకారుడు థామస్ వాడ్‌హౌస్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన ముక్కును కలిగి ఉండేవారు. ఆయన ముక్కు 19cms(7.5inch) పొడవు ఉండేది. గిన్నిస్ రికార్డ్స్ ప్రకారం మానవ చరిత్రలోనే ఇదే అత్యధికం. ఈ అరుదైన రూపాన్ని గౌరవిస్తూ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని నేటికీ ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(47/100)
News April 16, 2026
IPL: రెండు మ్యాచులకు రోహిత్ శర్మ దూరం?

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల RCBతో మ్యాచులో గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఆయన ముంబై ఆడబోయే తర్వాతి రెండు మ్యాచులకు దూరం అయ్యే అవకాశం ఉందని NDTV పేర్కొంది. ఇప్పటికే వరుసగా 3 మ్యాచుల్లో ఓడిన ఆ జట్టుకు హిట్‌మ్యాన్ దూరమవడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. కాగా MI రేపు PBKS, ఈ నెల 20న GTతో తలపడనుంది.


