News February 12, 2026

ADB: విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా 249.82 ఎకరాలు

image

ఆదిలాబాద్ విమానాశ్రయం అభివృద్ధికి అదనంగా 249.82 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే.రామ్మోహన్ నాయుడికి సమాచారం ఇచ్చారు. జిల్లా అధికారులు కూడా అవసరమైన అదనపు భూములను సేకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వానికి తెలిపారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే మాస్టర్ ప్లాన్ రూపొందించింది.

Similar News

News April 19, 2026

ASF: అటెండెన్స్‌ కష్టాలు.. పౌడర్‌ రాస్తేనే హాజరు

image

ఉపాధి హామీ పనుల్లో అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేషియల్ అటెండెన్స్ విధానం ASF జిల్లాలో అమలవుతోంది. మొబైల్ యాప్ ద్వారా కూలీల హాజరు ఫొటోలు తీసి నమోదు చేస్తున్నారు. అయితే కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలతో హాజరు నమోదు ఆలస్యం అవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు జైనూర్ మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ వినూత్నంగా కూలీల ముఖాలకు పౌడర్ రాసి ఫొటోలు తీస్తూ అప్లోడ్ చేస్తున్నాడు.

News April 19, 2026

BREAKING.. పాలమూరు: ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు మృతి

image

అడ్డాకల్‌ మండల కేంద్రం సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడు మృత్యువాత పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కారులో వెళ్తున్న వారు.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2026

అగ్నిగుండంలా ఉమ్మడి ఆదిలాబాద్‌

image

ఉమ్మడి జిల్లా భానుడి భగభగలతో అల్లాడుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా కెరమెరిలో 44.6∘C, ఆదిలాబాద్‌, బేల 44.4∘C, దస్తురాబాద్‌లో 44.5∘C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 10 గంటల నుంచే వీధులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండాలంటే నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచిస్తున్నారు.