News February 12, 2026

రాహుల్ గాంధీతో కలిసి ధర్నాలో పాల్గొన్న పెద్దపల్లి ఎంపీ

image

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహించిన ధర్నాలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

Similar News

News April 17, 2026

TU: పాలకమండలి సభ్యుడిని అభినందించిన TUTA

image

తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగం ప్రొఫెసర్ ఆంజనేయులును ప్రభుత్వం నియమించింది. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (TUTA) ఆయన్ను శుక్రవారం అభినందించింది. ప్రొఫెసర్ ఆంజనేయులు మాట్లాడుతూ.. యూనివర్సిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన వర్సిటీ ఉపకులపతి ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరిలకు కృతజ్ఞతలు తెలిపారు.

News April 17, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఇదే

image

మహిళా రిజర్వేషన్ ప్రస్తావన రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలోనే (1946-49) వచ్చినా అది సాధ్యపడలేదు. 1996లో దేవెగౌడ ప్రభుత్వం 33% రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టగా గందరగోళం నెలకొంది. 1998-2003 మధ్య నాలుగుసార్లు సేమ్ సీన్ రిపీటైంది. 2010లో మళ్లీ UPA ప్రభుత్వం మొదట రాజ్యసభలో ఆమోదించినా ఆ తర్వాత జాప్యం వల్ల అమలులోకి రాలేదు. 2023లో ఈ బిల్లుకు ఆమోదం లభించగా దీనికి సవరణలు చేపట్టి కేంద్రం మరోసారి తీసుకొచ్చింది.

News April 17, 2026

NTR జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

image

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. NTR జిల్లాలో మొత్తం 8,35,515 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,06,803 మంది ఉండగా, మహిళలు 4,28,680 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 32 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.