News February 12, 2026

సంక్షోభంలో సింగరేణి.. కొత్త CMD గట్టెక్కించేనా?

image

సింగరేణి నూతన సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాష్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా నైనీ బొగ్గు బ్లాకుల టెండర్లు, నిధుల మళ్లింపు ఆరోపణలతో రేగిన రాజకీయ దుమారం, కేంద్ర విచారణల నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమర్థుడైన అధికారికి పగ్గాలు అప్పగించేలా భారీ కసరత్తు చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడంలో కొత్త బాస్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని కార్మికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Similar News

News April 20, 2026

అక్షయ తృతీయ అంతంత మాత్రమే!

image

అక్షయ తృతీయ అంటేనే బంగారం షాపులు కిటకిటలాడాలి. కానీ ఈసారి ఆ జోష్ ఎక్కడా కనిపించలేదు. ఆకాశాన్ని తాకుతున్న ధరల వల్ల కస్టమర్లు దుకాణాలకు రావడానికే భయపడ్డారు. గతేడాది Hydలో 150 kgల బంగారం అమ్ముడైతే, ఈసారి అది 70 kgలకే పరిమితమైనట్లు వ్యాపారులు తెలిపారు. భారీ డిస్కౌంట్లు ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చిన్నపాటి కాయిన్స్ కొనడానికే చాలా మంది మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

News April 20, 2026

అమెరికా వార్‌షిప్స్‌పై ఇరాన్ డ్రోన్ దాడులు

image

US తమ <<19693927>>నౌకను<<>> స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఆ దేశ యుద్ధనౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. మరో రెండు రోజులు సీజ్‌ఫైర్ అమలులో ఉండగానే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. US-ఇరాన్ మధ్య రెండో విడత చర్చలకు ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దాడులు జరగడంతో డీల్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చమురు ధరలు సైతం భగ్గుమంటున్నాయి. WTI క్రూడ్ $90, బ్రెంట్ క్రూడ్ $96 డాలర్లకు చేరింది.