News February 12, 2026
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

డీఎంఎఫ్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. గురువారం బాపట్ల కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.54.80 కోట్ల నిధుల్లో 42 పనులకు ఆమోదం లభించగా, 11 పనులు రూ.6.62 కోట్లతో పూర్తయ్యాయన్నారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. తాగునీటి చెరువులు, రహదారులు, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
Similar News
News April 17, 2026
ఏలూరు జిల్లా కలెక్టర్ హెచ్చరిక

ఏలూరు జిల్లాలో మాతృ, శిశు మరణాలను పూర్తిగా అరికట్టాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. వైద్య, ఐసీడీఎస్ విభాగాలు సమన్వయంతో పనిచేసి మరణాల సంఖ్యను సున్నాకు తీసుకురావాలన్నారు. జనవరి నుంచి మార్చి వరకు నమోదైన మరణాలపై మెడికల్ ఆడిట్ నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు.
News April 17, 2026
మన్యం జిల్లాలో మహిళా ఓటర్లే ఎక్కువ..

పార్వతీపురం జిల్లాలోని 443 గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 9,72,195 మంది ఓటర్లు నమోదవ్వగా వీరిలో 4,77,857 మంది పురుషులు, 4,94,338 మంది మహిళలున్నారు. పార్వతీపురం మండలంలో అత్యధికంగా 28,449 మంది ఓటర్లు ఉన్నారు. భామిని మండలంలో అత్యల్పంగా 10,429 మాత్రమే నమోదయ్యారు. త్వరలో పంచాయతీ కార్యాలయాల్లో జాబితాలను ప్రదర్శించనున్నారు.
News April 17, 2026
అపార్టుమెంట్లలో EV ఛార్జింగ్ పాయింట్లు

TG: భవిష్యత్తు అవసరాల దృష్ట్యా GOVT, PVT భాగస్వామ్యంలో మరిన్ని EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని CS రామకృష్ణారావు అధికారులను ఆదేశించారు. EVల సంఖ్య పెరుగుతున్నందున గ్రామీణ, పట్టణ ప్రజలకు వీటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటి మ్యాపింగ్‌కు డ్యాష్ బోర్డును అభివృద్ధి చేయాలన్నారు. నగరాల్లోని అపార్టుమెంట్లలో ఈ ఛార్జింగ్ పాయింట్లను తప్పనిసరి చేయనున్నట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు.


