News February 12, 2026
కౌంటింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు: సీపీ సన్‌ప్రీత్ సింగ్

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో జనగామ, స్టే.ఘ, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు CP సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో బీఎన్‌ఎస్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయని, ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నేరమని హెచ్చరించారు.
Similar News
News February 19, 2026
T20WC.. శ్రీలంకపై జింబాబ్వే సంచలన విజయం

T20WCలో మరో సంచలనం నమోదైంది. ఇటీవల ఆస్ట్రేలియాను ఓడించిన జింబాబ్వే ఇవాళ శ్రీలంకను 6 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. తొలుత లంక 20 ఓవర్లలో 178/7 రన్స్ చేసింది. అనంతరం జింబాబ్వే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ బెన్నెట్ (63*), సికిందర్ రజా 45 పరుగులతో తమ జట్టును గెలిపించారు. ఇప్పటికే జింబాబ్వే సూపర్-8లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.
News February 19, 2026
‘రఫేల్’ భారత్‌ను బలోపేతం చేస్తుంది: మాక్రాన్

ఫ్రాన్స్‌తో భారత్ 114 రఫేల్ విమానాల డీల్ ప్రతిపాదనను ఆ దేశ అధ్యక్షుడు మాక్రాన్ సమర్థించారు. ఈ డీల్‌పై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ డీల్ భారత్‌ను బలోపేతం చేస్తుందని, భారత్-ఫ్రాన్స్ బంధం పెరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఇక రఫేల్ యుద్ధవిమానాల లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై సానుకూలంగా స్పందించారు. సబ్‌మెరైన్ల ప్రాజెక్ట్‌పైనా ఇరు దేశాలు కృషి చేస్తాయని ఆశిస్తున్నానని తెలిపారు.
News February 19, 2026
ఏలూరు: ‘అధికారుల తీరుపై ఉపేక్షించే ప్రసక్తే లేదు’

జిల్లా అధికారులు నిర్లక్ష్యంతో లక్ష్యాలను పూర్తి చేయకుంటే ఉపేక్షించే ప్రసక్తే లేదని కలెక్టర్ వెట్రీ సెల్వీ తేల్చి చెప్పారు. పంచాయతీరాజ్, జే రామ్ జీ, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, హౌసింగ్, ఇరిగేషన్ తదితర నిర్మాణ పనుల ప్రగతిపై గురువారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ..అంబెడ్కర్ గురుకులాలకు మంజూరైన 49 కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్ లకు 16 పనులు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


