News February 12, 2026
హలో అనేందుకు మంత్రుల హడల్

తెలంగాణలో ఇంకా ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న మంత్రి పొంగులేటి ఆరోపణ బాంబు ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ టూల్స్‌తో BRS ట్యాప్ చేయిస్తుందేమోనని అనుమానిస్తున్న మంత్రులు నార్మల్ కాల్స్ ఆన్సర్ చేయడం లేదు. కొందరు మినిస్టర్స్ కొన్ని కాల్స్ అటెంప్ట్ చేసినా పైపై మాటలే. డీటెయిల్స్ జోలికి వెళ్లడం లేదు. ముఖ్య విషయాలు డిస్కస్ చేసేందుకు వాట్సాప్ కాల్ లేదా యాపిల్ ఫేస్ టైం వాడుతున్నారని సమాచారం.
Similar News
News April 18, 2026
అభిషేక్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

IPL: చెన్నైతో మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అందులో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ‘పులి’కి IPLలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అటు హెడ్ (20 బంతుల్లో 23), ఇషాన్ కిషన్ (0) ఔటయ్యారు. ప్రస్తుతం 6 ఓవర్లలో స్కోర్ 75/2గా ఉంది.
News April 18, 2026
పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవాళ సర్జరీ జరిగింది. నిన్న ఓ సమావేశంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం, కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తిగా హెల్తీగా మారేందుకు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.
News April 18, 2026
పెద్దలు కుదిర్చే పెళ్లికి సిద్ధమైన శ్రుతి హాసన్?

హీరోయిన్ శ్రుతి హాసన్ పెద్దలు కుదిర్చే పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. వరుడిని వెతికే పనిలో తండ్రి కమల్ బిజీగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని సంబంధాలను చూసినా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది. వీలైనంత త్వరగా మ్యారేజ్ చేయాలని ఆయన భావిస్తున్నారట. కాగా గతంలో లండన్ బేస్డ్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలే, విజువల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో ఆమెకు బ్రేకప్ జరిగిన విషయం తెలిసిందే.


