News February 12, 2026
బాల భీముడు.. 5.20KGల బరువుతో జననం

TG: సాధారణంగా నవజాత శిశువులు పుట్టగానే 2.5-3.5 కిలోల బరువుంటారు. కొన్నిచోట్ల 4 కేజీల బరువుతోనూ జన్మించారు. అయితే భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో సంధ్యారాణి అనే మహిళ సీ సెక్షన్ ద్వారా 5.20 కేజీల బరువున్న మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఈ బాల భీముడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
Similar News
News March 10, 2026
TODAY HEADLINES

*ఫ్యూచర్‌లోనూ తప్పులు జరగకుండా పాస్ పుస్తకాలు: CBN
*రైతుబంధు కాదు.. రాహుల్ బంధు: KTR
*లిక్కర్ స్కామ్.. కవిత సహా 23 మందికి ఢిల్లీ HC నోటీసులు
*120 డాలర్లకు చేరిన బ్యారెల్ ముడి చమురు
*వంటగ్యాస్ కొరత.. బుకింగ్ పీరియడ్ 25 రోజులకు పెంపు
*కరూర్ తొక్కిసలాట ఘటన.. TVK చీఫ్ విజయ్‌కి CBI మరోసారి నోటీసులు
*టీమ్ ఆఫ్ ది టోర్నీని ప్రకటించిన ICC.. నలుగురు భారత ప్లేయర్లకు చోటు
News March 10, 2026
14 ఏళ్ల బాలికలకు మాత్రమే HPV: ప్రభుత్వం

AP: రాష్ట్రవ్యాప్తంగా 14 ఏళ్ల బాలికలు 3.45 లక్షల మంది ఉన్నారని, 3 నెలల పాటు వీరికి మాత్రమే HPV వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. టీకా ఇచ్చాక 30 ని. పాటు అక్కడే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పింది. పలువురికి నొప్పి, వాపు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని, ఇవి సాధారణంగా 2-3 రోజుల్లో తగ్గుతాయని పేర్కొంది. కాగా 3 నెలలపాటు ఈ టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది.
News March 10, 2026
స్లీపర్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తున్న ఇరాన్?

విదేశాల్లోని స్లీపర్ సెల్స్‌ను ఇరాన్ యాక్టివేట్ చేస్తోందని US అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇరాన్ నుంచి వెళ్లినట్లుగా భావిస్తున్న ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. ఖమేనీ మరణం తర్వాత ఈ సిగ్నల్స్ పంపినట్లు కనుగొన్నాయి. కోవర్ట్ ఆపరేటివ్స్/స్లీపర్ సెల్స్‌కు సూచనలు అందినట్లుగా అంచనావేశాయి. ఇదే నిజమైతే వారి ద్వారా ఇరాన్ ప్రతీకారం తీర్చుకునే అవకాశముందని ఆందోళన వ్యక్తంచేశాయి.


