News February 12, 2026
భూ వివాదాలు లేని మండలంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కలెక్టర్

నల్లచెరువులో కదిరి ఆర్డీవో వీవీఎస్ శర్మ, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ గ్రామసభ నిర్వహించారు. కలెక్టర్ శ్యాం ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొని గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించారు. అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా భూ వివాదాలు లేని మండలంగా నల్లచెరువు మండలాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News April 19, 2026
భద్రకాళి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఓరుగల్లు శ్రీ భద్రకాళి ఆలయంలో ఆదివారం మొదటి రోజు శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. అందులో భాగంగా ఉదయం అమ్మవారికి అర్చకులు శాస్త్రోక్తంగా పూర్ణాభిషేకం చేశారు. అనంతరం గణపతి హోమం, సుదర్శన హోమం, చండీ హోమం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
News April 19, 2026
‘జైలర్-2’కు రికార్డ్ బ్రేకింగ్ OTT డీల్?

రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వస్తున్న ‘జైలర్ 2’ అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా ₹160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయి ధర లభించడం ఇదే తొలిసారి. మొదటి పార్ట్ కంటే రెట్టింపు ధరకు డీల్ కుదరడం విశేషం. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ యాక్షన్ డ్రామాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు సన్ పిక్చర్స్ ప్లాన్ చేస్తోంది.
News April 19, 2026
అనంత: పెరుగుతున్న చీనీ ధరలు.. రైతుల హర్షం

అనంతపురం మార్కెట్ యార్డులో చీనీకాయల ధరలు కొన్ని రోజులుగా పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో శుక్రవారం 1,135 టన్నుల చీనీకాయలను టన్ను గరిష్ఠ ధర రూ.28 వేలకు రైతులు విక్రయించారు. మధ్యస్థం రూ.18 వేలు, కనిష్ఠం రూ.10 వేలు చొప్పున అమ్మారు. శనివారం రూ.29 వేలకు విక్రయాలు జరిగాయని యార్డు ఎంపికశ్రేణి ఇన్‌ఛార్జ్ కార్యదర్శి, ఏడీఎం రాఘవేంద్రకుమార్ తెలిపారు.


