News February 12, 2026
జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేడీ

భూపాలపల్లి జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ వి.నాగరాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న బిల్లుల ఆన్‌లైన్ ప్రాసెసింగ్ విధానం, పెండింగ్ బిల్లుల స్థితి, జీతభత్యాల చెల్లింపులు, పెన్షన్ కేసుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిధుల వినియోగం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు.
Similar News
News April 18, 2026
డీ‘లిటిగేషన్’.. గెలిచిందెవరు?

131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో <<19674859>>వీగిపోవడం<<>> తమ విజయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా బిల్లు గట్టెక్కలేదని, ఇది ప్రజాస్వామ్య గెలుపు అని చెబుతున్నాయి. BJP మాత్రం మహిళా కోటాకు ప్రతిపక్షాలు వ్యతిరేకమని ప్రజల్లోకి వెళ్తోంది. ఈ ప్రభావం బెంగాల్, TN ఎన్నికల్లో ఉంటుందని భావిస్తోంది. అందుకే సంఖ్యా బలం లేకున్నా బిల్లు పెట్టిందనే చర్చ సాగుతోంది. దీనిపై మీ కామెంట్.
News April 18, 2026
బార్ హెల్పర్‌పై దాడి ఘటనలో ముగ్గురిపై కేసు: SI జయలక్ష్మి

నరసాపురంలోని ఒక రెస్టారెంట్ అండ్ బార్‌లో గురువారం రాత్రి ఘర్షణ చోటుచేసుకుందని SI జయలక్ష్మి తెలిపారు. బార్ ముగిసే సమయం కావడంతో వెళ్లిపోవాలని కోరిన హెల్పర్ పులపర్తి వెంకట బాలాజీపై వర్ధినీది సాయి, పాలూరి బోల, పాలూరి నరసింహ మద్యం బాటిల్‌తో దాడి చేశారని వెల్లడించారు. ఈ దాడిలో బాలాజీ నుదుటిపై తీవ్ర గాయమైందని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 18, 2026
భద్రాచలంలో నేడు జాబ్ మేళా

భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సేల్స్, బ్యాంకింగ్, ఎలక్ట్రీషియన్ విభాగాల్లో ఖాళీలు ఉండగా.. ఎంపికైన వారికి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు వేతనం లభిస్తుంది. 18-29 ఏళ్ల మధ్య ఉండి, పదో తరగతి నుంచి పీజీ, ఐటీఐ పూర్తి చేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ కోరారు. మరిన్ని వివరాలకు 9989209575 నంబర్‌ను సంప్రదించవచ్చు.


