News February 12, 2026
సిరిసిల్ల: కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కౌంటింగ్ అధికారులు, సిబ్బంది ర్యాండమైజెషన్ ప్రక్రియ గురువారం పూర్తి చేశారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రక్రియను ఆమె పూర్తి చేశారు. కార్యక్రమంలో డీఈఓ జగన్ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Similar News
News April 17, 2026
విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి: కలెక్టర్ నిషాంతి

విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అల్లూరి జిల్లా కలెక్టర్ నిషాంతి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శుక్రవారం పాడేరులో రైజింగ్ స్టార్స్ పేరుతో సత్కారించి బహుమతులు అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ కళాశాలల నుంచి ఏడుగురు, KGBV.ల నుంచి నలుగురు, ప్రభుత్వం జూనియర్ కళాశాలల నుంచి నలుగురికి ఈ సత్కారం లభించింది. పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
మెదక్: కార్మికుల కొత్త వేతన ఒప్పందం ఖరారు: CITU

సీఐటీయూ చొరవ, కార్మికుల ఐక్యతతోనే మెరుగైన వేతన ఒప్పందం సాధ్యమైందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ.మల్లేశం అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు శివారులోని నియాపోలి పరిశ్రమ కార్మికుల వేతన ఒప్పందంపై శుక్రవారం సంగారెడ్డి లేబర్ కమిషనర్ కార్యాలయంలో సంతకాలు పూర్తయ్యాయి. పాత ఒప్పందం మార్చి 31తో ముగియగా, కొత్త ఒప్పందం ద్వారా కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
News April 17, 2026
GWL: పాడి పశువుల పథకానికి ఈనెల 23 వరకు గడువు పొడిగింపు

ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా అందజేసే పాడి పశువుల యూనిట్ల దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారిణి నుషిత తెలిపారు. నిరుద్యోగ యువత ఎస్సీ కార్పొరేషన్ అధికారిక పోర్టల్ (OBMMS) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రతులను సంబంధిత మండల కేంద్రాల్లో అందజేయాలని పేర్కొన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


