News April 30, 2024

అమేథీలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ కార్యకర్తల ధర్నా

image

UPలోని అమేథీ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ పోటీపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే BJP అభ్యర్థి స్మృతి ఇరానీ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో INC అభ్యర్థిని త్వరగా తేల్చాలంటూ నేతలు, కార్యకర్తలు ఆ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. రాహుల్ గాంధీ లేదా ప్రియాంకా గాంధీ బరిలో నిలవాలంటూ నినాదాలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిన రాహుల్.. ఈసారి గెలిచి గౌరవాన్ని పొందాలని కోరారు. కాగా ఇక్కడ మే 20న పోలింగ్ జరగనుంది.

Similar News

News February 2, 2026

హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటుతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు

image

కేంద్ర బడ్జెట్‌లో రైల్వేకు రూ.2.77 లక్షల కోట్లు కేటాయించడంపై సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ సంతోషం వ్యక్తం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యాల దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని పేర్కొన్నారు. రైల్వే, ప్రయాణికుల భద్రత కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఏడు హైస్పీడ్ కారిడార్ల అభివృద్ధి వల్ల రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 2, 2026

ఇండియన్ నేవీలో 260 పోస్టులు

image

ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అకడమిక్ మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1,25,000 చెల్లిస్తారు. అర్హులు FEB-24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు https://www.joinindiannavy.gov.in చూడండి.

News February 2, 2026

రాష్ట్ర ప్రగతికి చేయూతనిచ్చేలా కేంద్ర బడ్జెట్: పవన్

image

AP: కేంద్ర బడ్జెట్ ఫలాలు ఏపీ ప్రగతికి దోహదం చేసేలా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. పర్యాటక రంగ ప్రోత్సాహకాలు అరకు అభివృద్ధికి, ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ రాష్ట్ర తీర ప్రాంత పారిశ్రామిక ప్రగతికి మరింత ఊతం ఇస్తుందన్నారు. బడ్జెట్‌లో కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాలతో కోనసీమ కొబ్బరి రైతులకు, ఉత్తరాంధ్ర జీడి రైతులకు మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.