News February 12, 2026
వేములవాడ: ఎన్నికల ఫలితాలు లెక్కింపునకు 28 టేబుల్స్

వేములవాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక వార్డు ఓట్లను ఒక్కో టేబుల్‌పై లెక్కిస్తారు. ఒక్కో రౌండ్‌లో వెయ్యి ఓట్లను లెక్కిస్తారు. 1000కి మించిన ఓట్లను రెండవ రౌండ్లో లెక్కిస్తారు. మొత్తం 28 వార్డులకు గాను మూడు వార్డుల్లో వెయ్యికి తక్కువ ఓట్లు పోల్ కాగా, మిగతా 25 వార్డుల్లో వెయ్యికి పైగా ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో మూడు వార్డుల ఫలితాలు తొలి రౌండులోనే రానున్నాయి.
Similar News
News April 19, 2026
చిత్తూరు: చెరువులో పడి ఇద్దరు మహిళలు మృతి

గుడిపల్లి (M) కనుమనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో గుడ్డలు ఉతికేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు బేబీ (19), దుర్గ (21) మృతి చెందారు. వరుసకు అక్క చెల్లెలు అయిన బేబీ, దుర్గ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
News April 19, 2026
అల్లికలతో వ్యసనాలకు చెక్!

స్మోకింగ్, గోళ్లు కొరకడం, గంటల తరబడి మొబైల్ చూడటం వంటి వ్యసనాల నుంచి బయటపడటానికి అల్లికలు మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. ఖర్చుతో కూడిన థెరపీలు, కౌన్సెలింగ్‌లు అవసరం లేదంటున్నారు. ‘అల్లికలు అందంగా ఉండనక్కర్లేదు. చేతులు, కళ్ల కదలికల వల్ల పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్ యాక్టివేటై శరీరం రిలాక్స్ అవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. అల్జీమర్స్, డిమెన్షియా వంటి సమస్యలూ తగ్గుతాయి’ అని పేర్కొంటున్నారు.
News April 19, 2026
రేపు యథావిధిగా ‘మీకోసం’: కలెక్టర్

అమలాపురంలో సోమవారం పీజీఆర్ఎస్ మీకోసం, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల కేంద్రంలో మీకోసం కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తారన్నారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేసుకుని పరిష్కార మార్గాలు పొందాలన్నారు.


