News February 12, 2026

ఖమ్మం ఆసుపత్రికి మహర్దశ.. కలెక్టర్ చొరవతో కొత్త రోడ్లు

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దశాబ్దం కాలంగా అధ్వానంగా ఉన్న అంతర్గత రోడ్లకు మోక్షం లభించింది. కలెక్టర్ ఆదేశాలతో కార్పొరేషన్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. రోడ్లతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, టాయిలెట్ల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నారు. దీనివల్ల నిత్యం ఆసుపత్రికి వచ్చే 5 వేల మంది రోగులు, సిబ్బందికి దుమ్ము, ధూళి సమస్యల నుంచి విముక్తి కలగనుంది.

Similar News

News April 18, 2026

ఒకేషనల్ విద్యార్థులకు క్లినికల్ శిక్షణ.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్ MPHW(F), MLT ఒకేషనల్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఏడాది పాటు క్లినికల్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కె. రవిబాబు తెలిపారు. తిరుమలాయపాలెం, సత్తుపల్లి, మధిర ఏరియా ఆసుపత్రుల్లో 30 మంది చొప్పున, వైరాలో 10 మందికి అవకాశం కల్పించనున్నారు. ఆసక్తి గల వారు ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు

News April 17, 2026

ఖమ్మం: బియ్యం అక్రమ రవాణాదారుపై పీడీ యాక్ట్‌

image

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆత్మకూరి జగదీష్‌పై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు సీపీ సునీల్ దత్ శుక్రవారం తెలిపారు. నిందితుడిపై ఖమ్మంలో 13 కేసులతో పాటు ఇతర జిల్లాల్లోనూ కేసులు ఉన్నాయని, అతడిని చంచలగూడ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. పేదల బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

News April 17, 2026

నిర్మాణ కార్మికుల కూలీ పెంపు: ఉప కార్మిక కమిషనర్

image

ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల కూలీ రేట్లను 10 శాతం పెంచుతూ కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఉప కార్మిక కమిషనర్ కె.విజయభాస్కర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన చర్చల్లో బిల్డర్లు, యూనియన్లు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం మేస్త్రీ కూలీ రూ.1,050, సహాయకుల కూలీ రూ.735 కు చేరింది. మే 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయని, సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేస్తామని కమిషనర్ స్పష్టం చేశారు.