News February 12, 2026
HYDలో డెంగీ కేసులు.. అసలు నిజం ఇదే!

కేంద్ర ప్రభుత్వ సంస్థ NCVBDC డేటా ప్రకారం TGలో 2021లో కేవలం 220గా ఉన్న అనుమానిత చికెన్ గున్యా కేసులు 2024 నాటికి 13,592కు చేరుకున్నాయి. GHMC జనవరి 2026లో డెంగీ కేసులు 30% తగ్గాయని ప్రకటించింది. ఇది కేవలం ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన డేటా మాత్రమే. ఎక్కువ మంది ప్రైవేట్ క్లినిక్‌లకు వెళ్లడం, IHIP పోర్టల్‌లో డేటా నమోదులో జాప్యం వల్ల అసలు సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.