News February 12, 2026

ఇంటర్ సెకండియర్లో NCERT ఆధారిత సిలబస్

image

AP: ఇంటర్ సెకండియర్లో 2026-27 నుంచి NCERT ఆధారిత సిలబస్‌ను అమలు చేస్తామని బోర్డు ప్రకటించింది. ‘సైన్సులో మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ (బోటనీ, జువాలజీ కలిపి) ఉంటాయి. ఆర్ట్స్‌లో సివిక్స్, ఎకనమిక్స్, కామర్స్, హిస్టరీలుంటాయి. భాషల్లో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ ఉంటాయి’ అని బోర్డు తెలిపింది. ఫస్టియర్లోని సవరించని 5 సబ్జెక్టులను 2026-27 నుంచి సవరించి అమలు చేస్తామని పేర్కొంది.

Similar News

News April 18, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమే: సీఎం రేవంత్

image

TG: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం BJP ఓటమి అని, విపక్షాల ఐక్యతతో కేంద్రం ఓడిందని CM రేవంత్ అన్నారు. ‘NDA నిజాయతీగా బిల్లు తీసుకురాలేదు. 3 బిల్లుల పేరుతో డీలిమిటేషన్ అమలుకు కుట్ర చేసింది. 2023 మహిళా బిల్లును యథాతథంగా అమలు చేస్తే మద్దతిస్తాం. మహిళా రిజర్వేషన్లలోనూ SC, ST, OBC కోటాలు ఉండాలి’ అని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. BJPకి 400సీట్లు వస్తే కచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్నారు.

News April 18, 2026

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపు

image

కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2 శాతం డీఏ (కరవు భత్యం) పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చివరిసారిగా గతేడాది అక్టోబర్‌లో డీఏ పెంచింది.

News April 18, 2026

బిల్లుపై కేంద్రం Vs ప్రతిపక్షాలు.. మీ అభిప్రాయమేంటి?

image

131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రజల మధ్య ఆసక్తికర చర్చ జరుగుతోంది. మహిళలకు మంచి చేయాలనుకున్న కేంద్రం.. పాత రిజర్వేషన్ బిల్లునే పెట్టాల్సిందని, దానికి డీలిమిటేషన్‌ను లింక్ చేయడం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్‌ వల్ల అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని, ప్రతిపక్షాలకు మహిళల పట్ల గౌరవం లేకనే ఉమెన్ బిల్లును వ్యతిరేకించాయని మరికొందరు అంటున్నారు. బిల్లుపై మీ ఒపీనియన్?