News February 12, 2026
VJA: మెడికో మృతికి ఒత్తిడి కారణమా.?

విజయవాడ GGHలో PG వైద్య విద్యార్థిని దీపిక అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. పోలీసులు కాల్ డేటాను విశ్లేషిస్తుండగా, పోస్టుమార్టం నివేదిక కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఆసుపత్రిలో తీవ్రమైన సిబ్బంది కొరత కారణంగా పెరిగిన పని ఒత్తిడి, కుటుంబానికి దూరంగా ఉండటమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని సహచర వైద్యులు అనుమానిస్తున్నారు.
Similar News
News April 17, 2026
NRPT: నిబంధనల ప్రకారమే లే-అవుట్లకు అనుమతులు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలకు లోబడే లే-అవుట్లకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా లే-అవుట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అందిన నాలుగు దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న రెండింటికి అనుమతులు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
తిరుపతి: ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు ఊరట

స్విమ్స్ శ్రీపద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2020-21 ఎన్‌ఆర్‌ఐ MBBS విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు 5 ఏళ్లకు బదులు 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. కోర్సు వ్యవధి మేరకే ఫీజులు ఉండాలన్న విద్యార్థుల విజ్ఞప్తిపై టీటీడీ ఈవో రవిచంద్ర స్పందించి, ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. దీనిపై స్విమ్స్ ఎగ్జిక్యూటివ్ బాడీ ఆమోదం పొందనుంది. ఈ విధానం ఇకపై తదుపరి బ్యాచ్‌లకు కూడా వర్తించనుంది.
News April 17, 2026
LSSSDCతో తెలంగాణ యూనివర్సిటీ MoU

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్‌కు చెందిన Life sciences sector skill development council, తెలంగాణ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం (MoU) చేసుకున్నారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులైన M.Sc, B.Sc, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ విద్యార్థులకు వివిధ సెక్టార్ కంపెనీల కోసం ఈ సంస్థ ముఖాముఖి నిర్వహించనుంది. రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి పాల్గొన్నారు.


