News February 12, 2026
మేడారం హుండీ ఆదాయం రూ.13,51,76,275

మేడారం వన దేవతల జాతరలో భక్తులు సమర్పించిన కానుకల లెక్కింపు ప్రక్రియ పూర్తయింది. మొత్తం హుండీలను తెరిచి 8 రోజుల పాటు లెక్కించగా రూ.13,51,76,275 ఆదాయం సమకూరినట్లు ఎండోమెంట్ ఉప కమిషనర్ రామల సునీత తెలిపారు. సమ్మక్క ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 309, సారలమ్మ ప్రాంగణంలో 309, గోవిందరాజు వద్ద 81, పగిడిద్దరాజు వద్ద 81 హుండీలను పూర్తిగా లెక్కించారు.
Similar News
News April 17, 2026
BREAKING: బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ రైడ్స్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులకు రైడ్స్ చేపట్టారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు. అద్దెకు ఉండే ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
News April 17, 2026
ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.
News April 17, 2026
తిరుచానూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు

తిరుచానూరులో కొత్త సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన పనిభారం, ప్రజలకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో రేణిగుంట, తిరుపతి రూరల్ కార్యాలయాల పరిధిని విభజించి ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. రేణిగుంట నుంచి 3, తిరుపతి రూరల్ నుంచి 19 గ్రామాలను కొత్త కార్యాలయ పరిధిలోకి తీసుకువస్తారు. దీంతో సేవలవేగం, పారదర్శకత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.


