News February 12, 2026

వేములవాడలో మొదలైన క్యాంపు రాజకీయాలు

image

వేములవాడ మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎన్నికల ఫలితాలు లెక్కింపునకు ముందే 28 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు క్యాంపునకు తరలి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన అనంతరం, సాయంత్రం 6 గంటల సమయంలో ప్రత్యేక బస్సులో వీరంతా క్యాంపునకు తరలి వెళ్లారు. చైర్ పర్సన్ ఎన్నిక కోసం ఈనెల 16న వారు తిరిగి వస్తారు.

Similar News

News April 18, 2026

తండ్రయిన రషీద్ ఖాన్

image

అఫ్గాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తండ్రయ్యారు. తన భార్య మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. చిన్నారికి అజ్లాన్ ఖాన్ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. రషీద్ ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.

News April 18, 2026

సూర్యాపేట: ‘టి-హబ్ సేవలను మరింత బలోపేతం చేయాలి’

image

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యక్షతన టి-హబ్ సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యం 1500 మందికి పైగా రోగులకు సుమారు 5500 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్త పరీక్షల్లో నాణ్యత, ఖచ్చితమైన ఫలితాలు వచ్చేలా పర్యవేక్షణ పెంచాలని అధికారులను ఆదేశించారు. నమూనాల తిరస్కరణపై నివేదిక కోరడంతో పాటు, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

News April 18, 2026

కామారెడ్డి: సప్త ప్రాకారాల సిద్ధిరామేశ్వరాలయం

image

భిక్కనూర్‌లోని సిద్ధిరామేశ్వర ఆలయానికి సప్తప్రాకారాల ఆలయంగా పేరు ఉంది. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయంగా చెబుతారు. ఈ ఆలయానికి ఏడు వరసల గోడలు ఉండటం వల్ల ఈ పేరు వచ్చిందని, శత్రువుల దాడి నుంచి కాపాడటానికి ఈ నిర్మాణం చేశారని స్థానికులు చెబుతారు. ఆలయ ప్రవేశ ద్వారాలు, స్తంభాలపై కాకతీయుల శిల్పకళా ముద్రలు కనిపిస్తాయి. సుమారు 800 సం.రాల క్రితం నిర్మించారని చరిత్రకారులు భావిస్తారు.
#WORLD HERITAG SPECIAL