News February 12, 2026

GNT: YCP రాష్ట్ర యువజన జాయింట్ సెక్రటరీగా సంజీవ రెడ్డి

image

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా ఫిరంగిపురం మండలం నుదురుపాడుకు చెందిన సంజీవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తన నియామకానికి సహకరించిన నియోజకవర్గ సమన్వయకర్త డైమండ్ బాబుకు, పార్టీ అధిష్ఠానానికి సంజీవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 18, 2026

గుంటూరులో NHM పోస్టుల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి!

image

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖలో 7 ఎన్‌హెచ్‌ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్ తదితర ఖాళీలున్నాయి. ఆసక్తి గలవారు www.guntur.nic.in లో దరఖాస్తులు పొందవచ్చని DMHO విజయలక్ష్మి తెలిపారు. ఓసీ, బీసీలు రూ.800, ఇతరులు రూ.500 ఫీజు బ్యాంకులో చెల్లించాలి. నింపిన దరఖాస్తులను ఈ నెల 18 నుంచి 30 లోగా నేరుగా లేదా రిజిస్టర్ పోస్టులో డీఎంహెచ్‌వో ఆఫీసులో అందజేయాలి.

News April 18, 2026

GNT: తీర్పు నేడే.. మళ్లీ కస్టడీ దొరుకుతుందా?

image

అక్రమాస్తుల కేసులో అరెస్టైన దేవదాయ శాఖ అధికారిణి శాంతిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గతంలో రెండు రోజుల పాటు విచారించినా కీలక సమాచారం రాబట్టలేకపోయామని, ఆమె ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరింత విచారణ కోసం 10 రోజుల కస్టడీ కోరగా, కోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.