News February 12, 2026
T20 WC: పాక్ మ్యాచుకూ అభిషేక్ దూరం?

టీమ్‌ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం నుంచి ఇంకా కోలుకోలేదని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే నమీబియాతో మ్యాచుకు దూరమైన అభిషేక్ మరో మ్యాచుకూ దూరమవ్వొచ్చని టాస్ సమయంలో SKY చెప్పారు. దీంతో ఈ నెల 15న పాక్‌తో మ్యాచుకు అభిషేక్ అందుబాటులో ఉండడం కష్టమేనని తెలుస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆడకపోవడం భారత్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.
Similar News
News April 18, 2026
పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.
News April 18, 2026
IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.
News April 18, 2026
SRHలోకి సౌతాఫ్రికా పేసర్

IPL: గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పేన్ స్థానంలో SRH మరో పేసర్‌ను తీసుకుంది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ గెరాల్డ్ కోయెట్జీని రూ.2కోట్లకు జాయిన్ చేసుకుంది. ఈ విషయాన్ని IPL, ఫ్రాంచైజీ అఫీషియల్‌గా ప్రకటించాయి. కోయెట్జీ గతంలో ముంబై, గుజరాత్ జట్ల తరఫున 14 మ్యాచులు ఆడి 15 వికెట్లు పడగొట్టారు. సౌతాఫ్రికా తరఫున ఇప్పటివరకు 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20ల్లో 67 వికెట్లు తీశారు.


