News April 30, 2024
IPL: ముంబైపై లక్నో విజయం

ముంబైతో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 145 పరుగుల లక్ష్యాన్ని 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. లక్నో బ్యాటర్లలో స్టొయినిస్(62), రాహుల్(28) రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ 2, నబి, తుషార, కోయెట్జీ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో లక్నో మూడో స్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ముంబై ప్లేఆఫ్ ఆశలు సంక్లిష్టం అయ్యాయి.
Similar News
News February 1, 2026
టీమ్ఇండియాను ఓడించడం చాలా కష్టం: శాంట్నర్

ప్రస్తుత భారత T20 జట్టు అద్భుతంగా ఉందని NZ కెప్టెన్ శాంట్నర్ కొనియాడారు. సిరీస్ ప్రారంభంలోనే తాను ఈ మాట చెప్పినట్లు తెలిపారు. స్వదేశంలో ఆ జట్టును ఓడించడం చాలా కష్టమన్నారు. బౌలర్ల కోసం బౌండరీ రోప్‌లను కాస్త వెనక్కి జరిపితే బాగుండేదని నవ్వుతూ అన్నారు. IND బ్యాటింగ్ ముందు 200+పరుగులూ కాపాడుకోవడం కష్టమని ఇటీవల శాంట్నర్ చెప్పిన విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచులో ఓటమితో 1-4తో NZ సిరీస్ కోల్పోయింది.
News February 1, 2026
ఇది చారిత్రాత్మక బడ్జెట్: ప్రధాని మోదీ

2026-27 కేంద్ర బడ్జెట్ చారిత్రాత్మకమని అని ప్రధాని మోదీ ప్రశంసించారు. 2047 వికసిత్ భారత్ ఆశయాలకు ఈ బడ్జెట్ దోహద పడుతుందని అన్నారు. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేలా దీనిని రూపొందించారని పేర్కొన్నారు. హైకేపెక్స్, హైగ్రోత్‌ను సమన్వయం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. బయోఫార్మా శక్తి మిషన్, సెమీకండక్టర్ మిషన్ 2.0, రేర్ ఎర్త్ కారిడార్ మొదలైనవి ప్రకటించడం అభినందనీయమన్నారు.
News February 1, 2026
ట్యాక్స్ శ్లాబ్‌లలో మార్పు లేదు.. పాతవే కంటిన్యూ!

బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఎటువంటి మార్పులు లేవు. పాత శ్లాబ్‌లనే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పన్ను విధానం కింద గతంలో ఉన్నట్లే స్టాండర్డ్ డిడక్షన్ ₹75,000తో కలిపి ₹12.75 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను సున్నా. ఆ పరిమితి దాటితే ₹4 లక్షల వరకు-0%, ₹4-8 లక్షలు-5%, ₹8-12 లక్షలు-10%, ₹12-16 లక్షలు-15%, ₹16-20లక్షలు-20%, ₹20-24 లక్షలు-25%, ₹24 లక్షల పైన-30% పన్ను కట్టాలి.


