News February 12, 2026
సిరిసిల్ల : ఓట్ల లెక్కింపునకు 250 మంది పోలీసులతో బందోబస్తు

సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ మహేష్ బీ గీతే తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని పేర్కొన్నారు. ఎన్నికల నియమావళి అమలు ఉన్నందున ఆంక్షలు పాటించాలని సూచించారు.
Similar News
News February 22, 2026
కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.
News February 22, 2026
అనంత: పరీక్షకు ముందే ఇంటర్ ప్రశ్నపత్రాల ఓపెన్

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశ్నపత్రాలు ఆయా సెంటర్లకు చేరుకున్నాయి. అయితే ఒక కేంద్రానికి కేటాయించిన బండిళ్లు మరో కేంద్రానికి వచ్చాయి. పరీక్షకు 10 నిమిషాల ముందు తెరవాల్సిన బండిళ్ల (సెట్-3)ను నిన్ననే ఓపెన్ చేయడం చర్చనీయాంశమైంది. ఉరవకొండలోని ఓ కేంద్రానికి సంబంధించిన కవర్లు చెక్ చేయగా 6 కవర్లలో 4 కవర్లు అదే సెంటర్‌కు, మిగిలిన 2 కవర్లు వేరే సెంటర్లకు చెందినవిగా గుర్తించారు.
News February 22, 2026
కృష్ణా: ఫార్మసీ పరీక్షల ఫలితాలు విడుదల

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో DEC 2025లో నిర్వహించిన బి.ఫార్మసీ 5వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ https://kru.ac.in/ ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చని, రీవాల్యుయేషన్‌కై దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఈ నెల 27లోపు ఒక్కో పేపరుకు రూ.1,000 చెల్లించాలని KRU అధ్యాపకులు తెలిపారు.


