News February 12, 2026
జోగిపేట: ‘కౌంటింగ్ కేంద్రంలోకి ప్రింట్ & మీడియాకు అనుమతి లేదు’

జోగిపేటలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రంలోకి పాస్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా జిల్లా కలెక్టర్ సంతకం ఉన్న అక్రిడిటేషన్ కార్డు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం అనుమతి పత్రాలు లేని వారిని లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News April 17, 2026
జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
News April 17, 2026
కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు: మిథున్ రెడ్డి

లోక్‌సభలో ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా YCP MP మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. నలుగురు కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ పట్టుబడ్డారు. అసభ్యకరమైన వీడియోలు బయటపడ్డాయి. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేసిన మహిళలనే టార్గెట్ చేసి వేధిస్తున్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’ అని డిమాండ్ చేశారు.
News April 17, 2026
SRPT: రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం తేవాలి: సౌమ్య మిశ్రా

రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజలందరూ చైతన్యం కలిగి ఉండాలని రాష్ట్ర జైలు శాఖ డీఐజీ సౌమ్య మిశ్రా అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. కారులో ప్రయాణించే వారు సీటు బెల్టు ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.


