News February 12, 2026

రేపు వైన్ షాపులు బంద్

image

TG: రేపు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఉ.6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకూ మద్యం షాపులు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. రేపు ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది.

Similar News

News April 18, 2026

బోల్డ్ ఫొటోకు కోహ్లీ లైక్.. మోడల్ ఏమన్నారంటే?

image

విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా ఫొటోను <<19671107>>లైక్<<>> చేసి తర్వాత అన్‌లైక్ చేయడంపై జర్మన్ ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్‌లాజ్ స్పందించారు. ‘విరాట్ నా ఫొటోకి లైక్ చేసినప్పుడు ఎంతో సంతోషించా. దానివల్ల SMలో ఇంతగా వైరల్ అవుతానని అనుకోలేదు. ఆ ఫొటోకు లైక్ చేయడంలో ఆయనకు దురుద్దేశం లేకపోయినా నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది చూసి ఆయనపై కాస్త జాలి కలిగింది. కోహ్లీ నుంచి లభించిన మద్దతుకు ధన్యవాదాలు’ అని తెలిపారు.

News April 18, 2026

నటిపై పరువు నష్టం దావా వేసిన చాహల్

image

తన పరువుకు భంగం కలిగించేలా SMలో పోస్ట్‌లు, మీడియా ముందు మాట్లాడినందుకు నటి తానియా <<19636894>>ఛటర్జీపై<<>> టీమిండియా క్రికెటర్ చాహల్ సీరియస్ అయ్యారు. తన గురించి తప్పుడు ప్రచారం చేస్తూ.. వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఆమెపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై తానియా స్పందిస్తూ.. ‘ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఇంత వైరల్ అవుతుందని అనుకోలేదు. దీనివల్ల నేనే ట్రోలింగ్‌కు గురయ్యా’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

News April 18, 2026

బాలయ్య-కొరటాల కాంబోలో సినిమా?

image

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో సినిమా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో తీస్తున్న సినిమా షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉండగా.. ఇది పూర్తయ్యాక కొరటాల ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు సరిపడే పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను కొరటాల సిద్ధం చేశారని, ‘దేవర-2’కి ముందే ఇది రాబోతుందని సమాచారం.