News May 1, 2024

నెల్లూరు జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లపై బైండోవర్

image

నెల్లూరు జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలకు 115 మంది, పార్లమెంటుకు 14 మంది పోటీ పడుతున్నారని కలెక్టర్ ఎం .హరి నారాయణన్ తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతుందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆరీఫ్ ఆఫీజ్ మాట్లాడుతూ. జిల్లాలో 982 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని తెలిపారు. శాంతి భద్రతలపై దృష్టి పెడుతామన్నారు.

Similar News

News March 21, 2026

నెల్లూరు జిల్లాలో లక్ష సిలిండర్ల బుకింగ్..!

image

యుద్ధం నేపథ్యంలో గ్యాస్ దిగుమతిపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఈక్రమంలో నెల్లూరు జిల్లాలో గడిచిన 10రోజుల్లోనే లక్ష సిలిండర్లను బుక్ చేశారు. సాధారణంగా నెలకు 40 వేల నుంచి 50 వేల వరకు డొమెస్టిక్ సిలిండర్లు బుక్ అయ్యేవి. గ్యాస్ కొరత వస్తుందేమోననే భయంతో ప్రజలు ఎగబడటంతో బుకింగ్ సంఖ్య లక్షకు చేరింది. సిలిండర్లకు ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేస్తూనే ఉన్న ప్రజలు భయాందోళన వీడటం లేదు.

News March 21, 2026

నెల్లూరు: మాఫియాకు చెక్ పెట్టేది ఎప్పుడు.. ఎలా?

image

ఒక్కసారి జరిగితే తప్పు. అదే పదేపదే జరిగితే నేరం. ప్రస్తుతం నెల్లూరులో జరిగేది ఇదే. రాజకీయ నేతల అండదండలతో రేషన్ బియ్యాన్ని దోచేస్తున్నారు. 2025లో 73 కేసులు నమోదు చేసి 2400 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. 2026లో 14 కేసులు నమోదు చేసి 650.8 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు. 15 నెలల్లోనే రూ. 1.37 కోట్ల ధాన్యం పట్టుబడింది. మాఫియాకు అధికారులు సైతం అండగా ఉంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

News March 21, 2026

నెల్లూరు జిల్లా రైతులకు తీవ్ర నష్టం

image

నెల్లూరు జిల్లాలో వరి పంట చేతికోస్తుంది. ఈక్రమంలో అకాల వర్షాలు రైతులను ముంచేసింది. అనంతసాగరం, కలవాయి,రాపూరు, మర్రిపాడు మండలాల పరిధిలో ఇటీవల వర్షం కురిసింది. దీంతో 19 గ్రామాల పరిధిలో వరి 1157 హెక్టర్లు, పత్తి 140 హెక్టర్లలో మొత్తంగా 1297 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు వ్యవసాయ అధికారులు చెప్పారు.