News February 13, 2026

ఈనెల 14 నుంచి మద్యం షాపులు మూసివేయాలి: కలెక్టర్

image

శివరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 65 శివాలయాల్లో భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, విద్యుత్ వంటి వసతుల్లో లోటు రానీయవద్దన్నారు. భద్రత దృష్ట్యా ఈనెల 14 నుంచి 16వరకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ శాంతిభద్రతల ఏర్పాట్లపై సూచనలిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

అనకాపల్లి: విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలి

image

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఇంటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించారు. ఫెయిల్ అయిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్న నేపాథ్యంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.

News April 16, 2026

అల్లూరి: తండ్రి ఆటో డ్రైవర్.. కుమారుడు జిల్లా టాపర్

image

ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన జయరామకృష్ణ CBSE పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 500/478 సాధించి ఉమ్మడి అల్లూరి జిల్లాకు టాపర్‌గా నిలిచాడని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్య తెలిపారు. జయరామకృష్ణ చింతూరు ఏకలవ్య పాఠశాలలో చదువుతున్నాడు. తండ్రి పరమయ్య ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ, కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమ కుమారుడు జిల్లా టాపర్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

News April 16, 2026

తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?.. హరీశ్‌రావు ఫైర్

image

పార్లమెంట్‌లో TG ఏర్పాటుపై BJP MP తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ఏర్పాటును పాకిస్థాన్‌తో పోలుస్తావా?, దశాబ్దాల పోరాటం, ఎంతో మంది త్యాగాల ఫలితమైన అలాంటి మహోద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపించడమే.. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించిన తేజస్వీ క్షమాపణలు చెప్పాలి’ అని ట్వీట్ చేశారు.