News February 13, 2026
ఈనెల 14 నుంచి మద్యం షాపులు మూసివేయాలి: కలెక్టర్

శివరాత్రి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 65 శివాలయాల్లో భక్తులకు క్యూలైన్లు, తాగునీరు, విద్యుత్ వంటి వసతుల్లో లోటు రానీయవద్దన్నారు. భద్రత దృష్ట్యా ఈనెల 14 నుంచి 16వరకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. ఎస్పీ ఉమామహేశ్వర్ శాంతిభద్రతల ఏర్పాట్లపై సూచనలిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అగ్నిమాపక, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నారు.
Similar News
News April 18, 2026
త్వరలోనే వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు శంకుస్థాపన: పొంగులేటి

సచివాలయంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిషోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, ఇతర అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్ట్‌లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్‌కు సంబంధించి ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించామని, త్వరలో శంకుస్ధాపన చేసుకోబోతునామన్నారు.
News April 18, 2026
మిషన్ ఎయిడ్స్ సురక్ష విజయవంతం చేయాలి: DMHO

నెల్లూరు బీవీ నగర్‌లోని DFIT కార్యాలయంలో HIV/ఎయిడ్స్‌పై DMHO వి.సుజాత, జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ ఆఫీసర్ డాక్టర్ ఖాదర్ వలీ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. DMHO మాట్లాడుతూ.. HIV నియంత్రణలో అందరూ భాగస్వాములు కావాలని, జిల్లాను HIV వ్యాప్తిలేని జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో కేసులను గుర్తించి స్వచ్ఛంద సంస్థలు మరింత మెరుగైన సేవలు అందించాలని పేర్కొన్నారు.
News April 18, 2026
జగిత్యాలలో వెల్ఫేర్ వీక్ విజయవంతం చేయాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఏప్రిల్ 20 నుంచి 26 వరకు నిర్వహించనున్న వెల్ఫేర్ వీక్‌ను విజయవంతం చేయాలని సూచించారు. జిల్లాలో 117 సంక్షేమ హాస్టళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఇప్పటివరకు 66 శాతం పూర్తయిందని, జూన్ 2లోగా 100 శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.


