News February 13, 2026

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా FEB 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్‌ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్‌తో పాటు అశ్వారావుపేట, ఇల్లందు, మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీలకు సంబంధించి నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫాస్ట్ రిజల్ట్స్‌కు Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News April 17, 2026

ఆదిలాబాద్: POLYCETకు దరఖాస్తు చేసుకోండి

image

పాలిటెక్నిక్‌లో ప్రవేశాల కోసం మే 13న నిర్వహించే ‘పాలీసెట్’ పరీక్షకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సంజయ్ గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్ష రాసిన, ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ నెల 20లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశ పరీక్షలో వచ్చే ర్యాంకు ఆధారంగానే డిప్లొమా కోర్సుల్లో సీట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు.
SHARE IT

సిరిసిల్ల: ‘ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి’

image

ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలని సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ అన్నారు. సిరిసిల్లలోని అంబేద్కర్ నగర్ లోని ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎండాకాలం నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు తెలియజేయాలన్నారు. మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. గర్భిణీల రిజిస్ట్రేషన్, టీకాలు, మందుల పంపిణీ సక్రమంగా చేయాలన్నారు.