News February 13, 2026

ఇందూరు: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని NZB కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువా, బిచ్కుంద మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. ఫలితాల కోసం Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News April 17, 2026

MBNR: ఫైనల్ ఇయర్ పరీక్ష రద్దు

image

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలో నిర్వహించిన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ జనరల్ సర్జరీ పేపర్-1 పరీక్షను అధికారులు రద్దు చేశారు. ఈ నెల 15న జరిగిన పరీక్షలో ప్రశ్నాపత్రంలో లోపాలు వెలుగుచూశాయి. 33 ప్రశ్నలు పేపర్-2కు సంబంధించినవిగా రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పరీక్షను రద్దు చేసి ఈనెల 27న తిరిగి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ప్రకటించారు.

News April 17, 2026

19న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు

image

ఈనెల 19న ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు సూర్యాపేటలోని లేడీ డీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గుండూరి కృపాల్, ఎల్. సతీష్ కుమార్ తెలిపారు. అండర్-7, 11, 19 విభాగాలలో బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారు హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారు.

News April 17, 2026

ప.గో: జీతాలు రాక హోంగార్డుల పరేషాన్!

image

జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు గత 15 రోజులుగా జీతాలు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 190 మంది హోంగార్డులకు సుమారు రూ.40 లక్షల వేతనాలు చెల్లించాల్సి ఉంది. అంకితభావంతో పనిచేస్తున్న తమపై అధికారులు నిర్లక్ష్యం వహించడం సరికాదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జీతాలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.