News February 13, 2026
NZB: రాష్ట్రస్థాయి విలువిద్య పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలకు గురువారం నిజామాబాద్‌లో ఖేలో ఇండియా విలువిద్య శిక్షణ కేంద్రం రాజారాం స్టేడియంలో జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు ఖమ్మంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారు. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో విలువిద్య శిక్షకులు మురళి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 20, 2026
నిజామాబాద్: ప్రజావాణికి 91 దరఖాస్తులు

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 91 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియాలు ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి, బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News April 20, 2026
బినోలలో దొంగల బీభత్సం.. బంగారం అపహరణ

నవీపేట్ మండలం బినోలలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన నర్సమ్మ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి సుమారు నాలుగు తులాల బంగారం అపహరించినట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. దొంగలను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.