News May 1, 2024
ఆసిఫాబాద్: CM పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన SP

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆసిఫాబాద్‌లోని ప్రేమల గార్డెన్‌లో ఏర్పాటు చేసి సభ స్థలాన్ని, హెలిప్యాడ్, వీఐపీ పార్కింగ్, ట్రాఫిక్ రూట్లు, సభ స్థాయికి వచ్చి వెళ్లే దారులు, జనరల్ పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ సురేశ్ కుమార్ పరిశీలించారు. అనంతరం భద్రతాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి, బందోబస్తు పరంగా చేయవలసిన ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News March 9, 2026
ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షకు.. 527 మంది గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 9,232 మంది విద్యార్థులకు గాను 8,705 మంది హాజరయ్యారని డీఐఈఓ జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. జనరల్ విభాగంలో 399 మంది, ఒకేషనల్ విభాగంలో 128 మంది కలిపి మొత్తం 527 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
News March 9, 2026
ఆదిలాబాద్: పలువురు తహశీల్దార్‌లకు స్థానచలనం

ముగ్గురు తహశీల్దార్లు, నలుగురు నాయబ్ తహశీల్దార్లకు స్థానచలనం కలిగింది. మండలాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ కలెక్టర్ రాజర్షిషా ఉత్తర్వులు జారీ చేశారు. భీంపూర్ తహశీల్దార్ నలంద ప్రియను కలెక్టర్ కార్యాలయ హెచ్-విభాగం సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఉట్నూర్ తహశీల్దార్ ప్రవీణ్ కుమార్ బేలకు స్థానచలనం కల్పించారు. కలెక్టర్ కార్యాలయం-హెచ్ సూపరింటెండెంట్ పంచపూలను డీ విభాగానికి వెళ్లారు.
News March 9, 2026
ఆదిలాబాద్: రేపే జాబ్ మేళ.. అన్ని ఏర్పాట్లు పూర్తి

ఆదిలాబాద్ పట్టణంలోని AR హెడ్ క్వాటర్స్‌లో మంగళవారం మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సుమారు 50 వరకు కంపెనీలు ఇందులో పాల్గొని దాదాపు 2,000 మందిని భర్తీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు తమ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.


