News February 13, 2026

పార్వతీపురం: జిల్లా ఎస్పీ ఆదేశాలు

image

పార్వతీపురం మండలం అడ్డాపుశీల శివాలయం వద్ద మహాశివరాత్రి ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి గురువారం పరిశీలించారు. పండుగ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రవేశం, క్యూలైన్లు, పార్కింగ్, సీసీ కెమెరాల పర్యవేక్షణపై పలు సూచనలు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో అలసత్వం వహించరాదని స్పష్టం చేశారు.

Similar News

News April 16, 2026

బాహ్యరూపం చూసి అంచనా వేయొద్దు!

image

మిరెము గింజ చూడ మీద నల్లగనుండు
కొరికి చూడ లోనంజురు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: మిరియపు గింజ పైకి నల్లగా, అందవిహీనంగా ఉన్నప్పటికీ కొరికినప్పుడు దాని పనితనం తెలుస్తుంది. అలాగే సజ్జనులు పైకి సామాన్యంగా కనిపించినా వారి లోపల అపారమైన జ్ఞానం, మంచి గుణాలు ఉంటాయి.
<<-se>>#PADHYAM<<>>

News April 16, 2026

VKB జిల్లా భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి!

image

జిల్లాలో భూగర్భ జల మట్టం రోజురోజుకూ ఆందోళనకరంగా పడిపోతోంది. జిల్లాలో సగటున 13.9 మీటర్ల లోతుకు నీటి నిల్వలు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఎండల తీవ్రత పెరగడం, వర్షపాతం తగ్గడం మరియు విచ్చలవిడిగా బోర్లు వేయడమే ఇందుకు ప్రధాన కారణాలని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడి మొదలవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 16, 2026

MDK: డిప్లొమా కోర్సుల్లో అనాథ బాలికలకు 70% సీట్లు: కలెక్టర్

image

HYDలోని ప్రభుత్వ మహిళా సాంకేతిక విద్యా సంస్థలో అనాథ, నిరుపేద బాలికలకు డిప్లొమా కోర్సుల్లో 70 శాతం సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సివిల్, CSE, ECE, EEE విభాగాల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారు పాలిసెట్ (POLYCET) ద్వారా ప్రవేశం పొందవచ్చని, ఆసక్తి గల వారు మరిన్ని వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు.