News February 13, 2026

ADB: IIT, NITలకు ‌ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో COE ప్రవేశాల కోసం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఎల్సీ కెప్టెన్ సలీముద్దీన్ తెలిపారు. చించొలిలోని RTO ఆఫీస్ వెనుక ఉన్న మైనారిటీ బాలుర విద్యాలయం ఈ పరీక్షా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు IIT, NIT ప్రవేశ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.

Similar News

News February 16, 2026

వీరు ఉపవాసం చెయ్యకూడదు

image

ఉపవాసం మంచిదే కొందరికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులు, BP, కొరోన‌రీ ఆర్ట‌రీ, అరిథ్మియా స‌మ‌స్య‌లున్న‌వారు ఉప‌వాసం చేస్తే చ‌క్కెర స్థాయిలు, ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తుల్య‌త‌, నీటి శాతం త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. బీటా బ్లాక‌ర్స్, యాంటీ అరిథ‌మిక్స్, బ్ల‌డ్ థిన్న‌ర్స్ మందులు వాడే వారు ఆహారంతో పాటు నిర్దిష్ట స‌మ‌యంలో మందుల‌ను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.

News February 16, 2026

నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి AIIMS నోటిఫికేషన్

image

న్యూఢిల్లీలోని AIIMS నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి (NORCET 10)షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(Hons.)నర్సింగ్, BSc(నర్సింగ్) , డిప్లొమా(GNM)అర్హత గలవారు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(ప్రిలిమినరీ, మెయిన్స్) ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.3వేలు, SC, ST, EWSలకు రూ.2400. వెబ్‌సైట్: https://aiimsexams.ac.in

News February 16, 2026

ఆదిలాబాద్‌ పురపీఠంపై ‘పొత్తు’ పొడుపు!

image

ఆదిలాబాద్‌ మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో స్వతంత్రులు కీలకంగా మారారు. ఈ క్రమంలో అధికారం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు చేతులు కలిపేందుకు సిద్ధమవుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్వతంత్రుల మద్దతు కోసం పార్టీలు ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విలువల కంటే పీఠమే ముఖ్యమైందని స్థానికులు విమర్శిస్తున్నారు.