News February 13, 2026

ADB: IIT, NITలకు ‌ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో COE ప్రవేశాల కోసం ఈ నెల 14న ఉదయం 10 గంటలకు రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆర్ఎల్సీ కెప్టెన్ సలీముద్దీన్ తెలిపారు. చించొలిలోని RTO ఆఫీస్ వెనుక ఉన్న మైనారిటీ బాలుర విద్యాలయం ఈ పరీక్షా కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇందులో ఎంపికైన విద్యార్థులకు ఇంటర్ విద్యతో పాటు IIT, NIT ప్రవేశ పరీక్షలకు ఉచిత ప్రత్యేక శిక్షణ అందిస్తామని ఆయన వెల్లడించారు.

Similar News

News April 19, 2026

MBNR: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ప్రజల విలవిల

image

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 43.4, గండీడ్ మండలం సల్కర్ పేట 43.3, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 43.2, అడ్డాకుల 43.0, కోయిలకొండ మండలం పారుపల్లి 42.9, కౌకుంట్ల 42.7, మహబూబ్ నగర్ అర్బన్ 42.6, దేవరకద్ర 42.5 ఉష్ణోగ్రత నమోదయింది.

News April 19, 2026

ప్రత్యేక శిక్షణతో వినికిడి సమస్యకు చెక్.!

image

‘శ్రవణం ప్రాజెక్ట్’లో టీచింగ్‌కు స్పెషల్ B.ED చేసిన వారే అర్హులు. వీరు స్పీచ్ థెరపీని ప్రత్యేక విధానం ద్వారా బోధిస్తారు. నిత్యం వాడే వస్తువుల నుంచి ఒక్కో పదం గట్టిగ చెప్తూ, పిల్లల చేతికి వస్తువులను ఇచ్చి ఒక్కో పదంగా వారి నోటి వెంట వచ్చేలా చేస్తారు. డ్రాయింగ్, గేమ్స్, ఇతర అంశాలపై పిల్లలతోపాటు తల్లిదండ్రులకు సైతం శిక్షణ ఇస్తారు. ఇలా ఎంతో ఖర్చుతో కూడుతున్న ఈ వ్యవహారాన్ని TTD ఉచితంగా అందస్తోంది.

News April 19, 2026

MBNR: ప్రముఖ కవి కమలేకర్‌ దాగోజీరావు కన్నుమూత

image

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పండితులు ఆచార్య కమలేకర్‌ దాగోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. భగీరథ కాలనీలోని ఆయన నివాసంలో పార్థివదేహాన్ని సందర్శనార్థం ఉంచారు. నేటి సాయంత్రం 4 గంటలకు వీరన్నపేట శివాలయం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతిపట్ల సాహితీలోకం ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.