News February 13, 2026
MDK: ఫలితాలపై ఉత్కంఠ.. మరికొద్ది గంటల్లో ఫలితాలు!

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగియడంతో నేడు జరిగే ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి పడింది. అభ్యర్థుల భవితవ్యం బాక్సుల్లో నిక్షిప్తం కావడంతో పార్టీల నేతలు, పోటీ చేసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. తుది ఫలితాలు వెల్లడైతే ఎవరి భవిష్యత్ ఏమిటో తేలిపోతుంది. ఉమ్మడి MDK జిల్లాలో 409 వార్డులకు, 1486 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. BRS, కాంగ్రెస్, BJP మధ్యే పోటీ ఉంది.
Similar News
News April 16, 2026
నిర్మల్: వేసవి సెలవులు.. జాగ్రత్తగా విద్యా పరికరాలు

ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్లు, రికార్డులు, ల్యాబ్ పరికరాలను భద్రపరచాలని హెడ్ మాస్టర్లకు సూచించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆకతాయిల వల్ల నష్టం కలగకుండా నిఘా ఉంచాలని పేర్కొంది. పాఠశాల ఆస్తిని మన సంపదగా భావించి కాపాడాలని స్పష్టం చేసింది.
News April 16, 2026
ఏప్రిల్ 22న జిల్లాస్థాయి ‘చదువుల పండుగ 2.0’: డీఈవో

నారాయణపేట జిల్లాలో ఏప్రిల్ 22న జిల్లా స్థాయి ‘చదువుల పండుగ 2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీఈవో గోవిందరాజులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగనుంది. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం, క్విజ్, YOC విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 21 నాటికి మండల స్థాయి పోటీలు పూర్తి చేసి, విజేతలను జిల్లా స్థాయికి పంపుతారు.
News April 16, 2026
విధిని వెక్కిరించిన సిక్కోలు విద్యార్థి

పలాసకు చెందిన సకల భక్తుల వంశీకి పుట్టుకతోనే చేతులు, కాళ్లు సహకరించని పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు 972 మార్కులు సాధించారు. తండ్రి లక్ష్మణరావు చిరు వ్యాపారి, తల్లి పార్వతి గృహిణి. స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఎంపీసీ గ్రూపులో చదివించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్ , స్నేహితుల సహకారం మరువలేనిదని వంశీ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.


