News February 13, 2026
WGL: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, మహబూబాబాద్, తొర్రూర్, కేసముద్రం, మరిపెడ, భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ వివరాలను తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.
Similar News
News April 18, 2026
GNT: అమరావతిలో ఇప్పటివరకు రైతులకు ఎన్ని ఫ్లాట్లు కేటాయించారంటే!

అమరావతి ప్రాంతంలో ఇప్పటివరకు మొత్తం 72,457 ప్లాట్లు రైతులకు కేటాయించినట్లు CRDA అధికారులు చెప్పారు. వాటిలో 64511ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని, ఇంకా 7864 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం 82 స్లాట్లు బుక్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా మొదటి దశలో ఇప్పటివరకు 34,999 వేల ఎకరాల భూమిని 29721 మంది రైతులు పూలింగ్‌కు ఇచ్చారు.
News April 18, 2026
శాతవాహనుల తొలి రాజధాని కొటిలింగాల..!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల తెలంగాణ చరిత్రలో విశిష్ఠ స్థానం కలిగిన ప్రాచీన క్షేత్రం. గోదావరి తీరాన ఉన్న ఈ ప్రాంతానికి దాదాపు 22 వందల సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. శాతవాహనుల తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కోటిలింగాలలో పురాతన నాణేలు, శాసనాలు, అవశేషాలు లభించాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ ఘన చరిత్రను మరోసారి Way2News వెలుగులోకి తీసుకువచ్చింది.
News April 18, 2026
పిల్లలతో నయన్, విఘ్నేశ్ క్యూట్ పిక్స్

లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తమ కవల పిల్లలతో కలిసి దిగిన క్యూట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ ఖాళీ సమయంలో ఉయిర్, ఉలగ్‌లతో ఈ జంట సరదాగా గడిపారు. తమ చిన్నారుల అల్లరికి సంబంధించిన చిత్రాలను షేర్ చేయగా.. అభిమానులు ఫిదా అవుతున్నారు. సెలబ్రిటీ పేరెంట్స్‌గా వారు పంచుకున్న ఈ మధుర క్షణాలు ట్రెండింగ్‌లో నిలిచాయి.


