News February 13, 2026
WGL: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట, జనగామ, స్టేషన్ ఘనపూర్, డోర్నకల్, మహబూబాబాద్, తొర్రూర్, కేసముద్రం, మరిపెడ, భూపాలపల్లి, ములుగు మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. పోలింగ్ వివరాలను తెలుసుకునేందుకు Way2Newsను చూస్తూ ఉండండి.
Similar News
News April 19, 2026
‘పెద్ది’లో చెర్రీతో సంయుక్త స్టెప్పులు?

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌కు టాలీవుడ్ వర్గాల్లో క్రేజ్ పెరుగుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్, మానస వారణాసిలు కనిపిస్తారని ప్రచారం జరగ్గా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. చెర్రీతో సంయుక్తా మీనన్ స్టెప్పులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల అఖండ-2 మూవీలో బాలయ్యతో కలిసి ‘జాజికాయ’ పాటకు ఈ బ్యూటీ మాస్ స్టెప్స్ వేశారు.
News April 19, 2026
రేపు అర్జీలు స్వీకరిస్తాం: NTR కలెక్టర్

విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డా.జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మున్సిపల్, మండల కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉండి వినతులు స్వీకరిస్తారన్నారు. రెవెన్యూ క్లినిక్‌లలో కూడా అర్జీలు ఇవ్వవచ్చని ఆయన సూచించారు. కాల్ 1100 ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 19, 2026
అన్నమయ్య జిల్లాలో అగ్ని ప్రమాదాలపై విస్తృత ప్రచారాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఆదివారం అగ్నిమాపక అధికారి శివప్ప ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహించారు. స్థానిక సొసైటీ కాలనీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తే ఎలా ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు. మంటలు చెలరేగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ప్రజలకు డెమో నిర్వహించి అవగాహన కల్పించారు.


