News February 13, 2026
మెదక్: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

తెలంగాణ వ్యాప్తంగా 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, కోహిర్, నారాయణఖేడ్, ఆందోల్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది.
Similar News
News April 17, 2026
NTR జిల్లాలో పంచాయతీ ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే!

పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాను ప్రచురిస్తున్నారు. NTR జిల్లాలో మొత్తం 8,35,515 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. పురుషులు 4,06,803 మంది ఉండగా, మహిళలు 4,28,680 మంది ఉన్నట్లు చెప్పారు. ఇతరులు 32 మంది ఉన్నారని, ఇప్పటికే జిల్లాలో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ మొదలైంది. జాబితాలో పేరు లేని వారు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు ‘పరిశీలిస్తాం’ అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!
News April 17, 2026
HYD: 3 రక్షణ కమిటీలు.. ఆక్రమణదారుల కోసమేనా? (3)

చెరువులను కాపాడతామని 2018లో లేక్ ప్రొటెక్షన్ కమిటీ వేసిన సర్కారు ఆ తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. FTL మార్కింగ్, ఫెన్సింగ్ అంతా కాగితాలకే పరిమితమైంది. మియాపూర్‌లో బడా బాబులు ఓ చెరువును మింగేస్తుంటే అధికారులు <<19672685>>’పరిశీలిస్తాం’<<>> అంటూ కాలయాపన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కట్టడాలు కూల్చే ధైర్యం అధికారులకు లేదా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారా? దీనిపై దర్యాప్తు జరగాల్సిందే!


