News February 13, 2026

మెదక్: పుర ‘పోరు’.. నేడే ఫలితాలు

image

తెలంగాణ వ్యాప్తంగా 11న జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్‌ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల, సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, కోహిర్, నారాయణఖేడ్, ఆందోల్, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది.

Similar News

News April 19, 2026

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో దినుసుల ధరలు

image

జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో శనివారం పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠం ₹13,100, కనిష్ఠం ₹9,200, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం ₹11,500, కనిష్ఠం ₹9,055, మక్కలు గరిష్ఠం ₹1,950, కనిష్ఠం ₹1,765, కందులు ₹6,866, నువ్వులు ₹9,155, సోయాబీన్ ₹3,559, పొద్దుతిరుగుడు ₹3,059, జొన్నలు ₹4,559, శనగలు ₹4,200, వరి (1010) గరిష్ఠం ₹1,785, కనిష్ఠం ₹1,752, అనుములు ₹4,352గా పలికాయని మార్కెట్ అధికారులు తెలిపారు.

News April 19, 2026

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్

image

నిజామాబాద్ ఏఎస్పీగా శుభం ప్రకాశ్ నియమితులయ్యారు. వరంగల్ ఏసీపీగా ఉన్న శుభం ప్రకాశ్‌‌ను అడిషనల్ ఎస్పీగా నిజామాబాద్‌కు బదిలీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని వార్ధా జిల్లా. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.

News April 19, 2026

మెళియాపుట్టి: భర్త చితికి నిప్పుపెట్టిన భార్య

image

ఇంటి యజమాని మృతి చెందిన బాధను దిగమింగుతూ భార్య, భర్తకు తలకొరివి పెట్టిన ఘటన మెళియాపుట్టి(మ) చాపరలో జరిగింది. స్థానికుల వివరాల మేరకు..చాపరలో నివసిస్తున్న కృష్ణ(52) పెట్రోల్ బంక్‌లో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడగా..శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశాడు. పిల్లలు చిన్నవారు కాగా..భర్త మరణంతో కన్నీరుమున్నీరువుతూ ఆయన చితికి భార్య నిప్పుపెట్టింది.