News February 13, 2026
SVU కాన్వకేషన్ దరఖాస్తులకు గడువు పొడిగింపు

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU) 63-68 వార్షిక కాన్వకేషన్స్ (Convocations) దరఖాస్తులకు గడువు పొడిగించినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ (CE) రాజమాణిక్యం పేర్కొన్నారు. 2025 విద్యా సంవత్సరంలోపు డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ పూర్తిచేసిన అభ్యర్థులు మార్చి 10వ తేదీ కాన్వకేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News April 18, 2026
సంగారెడ్డి: ముగిసిన 1-9 తరగతుల పరీక్షలు

సంగారెడ్డి జిల్లాలో 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు శనివారంతో ముగిశాయి. జవాబు పత్రాలను త్వరగా మూల్యాంకనం చేసి ఈనెల 23న ఫలితాలు వెల్లడించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఇక ఈనెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సెలవుల సందడిలో మునిగిపోయారు.
News April 18, 2026
GNT: అమరావతిలో ఇప్పటివరకు రైతులకు ఎన్ని ఫ్లాట్లు కేటాయించారంటే!

అమరావతి ప్రాంతంలో ఇప్పటివరకు మొత్తం 72,457 ప్లాట్లు రైతులకు కేటాయించినట్లు CRDA అధికారులు చెప్పారు. వాటిలో 64511ప్లాట్లు రిజిస్ట్రేషన్ పూర్తి చేశామని, ఇంకా 7864 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కోసం 82 స్లాట్లు బుక్ చేసినట్లు పేర్కొన్నారు. కాగా మొదటి దశలో ఇప్పటివరకు 34,999 వేల ఎకరాల భూమిని 29721 మంది రైతులు పూలింగ్‌కు ఇచ్చారు.
News April 18, 2026
శాతవాహనుల తొలి రాజధాని కొటిలింగాల..!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల తెలంగాణ చరిత్రలో విశిష్ఠ స్థానం కలిగిన ప్రాచీన క్షేత్రం. గోదావరి తీరాన ఉన్న ఈ ప్రాంతానికి దాదాపు 22 వందల సంవత్సరాల చరిత్ర ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. శాతవాహనుల తొలి రాజధానిగా గుర్తింపు పొందిన కోటిలింగాలలో పురాతన నాణేలు, శాసనాలు, అవశేషాలు లభించాయి. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ ఘన చరిత్రను మరోసారి Way2News వెలుగులోకి తీసుకువచ్చింది.


