News February 13, 2026

NZB: కొన్ని గంటల్లో తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

image

నిజామాబాద్ నగరపాలక సంస్థతో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్గల్ మున్సిపాలిటీల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. మొత్తం 4,95,485 మంది ఓటర్లకు గాను 3,06,697 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల జయాపజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. గెలుపు ధీమాతో ప్రధాన పార్టీల అభ్యర్థులు లెక్కల్లో మునిగిపోయారు.

Similar News

News February 22, 2026

NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.