News February 13, 2026

రాయదుర్గంలో 50 అడుగుల వాయు శివలింగం

image

రాయదుర్గంలో ఓం శాంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. అందులో భాగంగా దబ్బడి కాంప్లెక్స్ వద్ద 50 అడుగుల వాయు శివలింగాన్ని ఏర్పాటు చేశారు. వాయు శివలింగం ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. నేటి నుంచి 16వ తేదీ వరకు జరగనున్న వేడుకల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఓంశాంతి నిర్వాహకురాలు యోగేశ్వరి మాత పిలుపునిచ్చారు.

Similar News

News April 17, 2026

మాత్రలను చల్లటి నీటితో వేసుకుంటున్నారా?

image

ఏదైనా అనారోగ్యానికి మాత్రలను, పొడి రూపంలోని ఔషధాలను గ్లాసు గోరు వెచ్చని నీటితో వేసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. చల్లటి నీటితో తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ కరగడం ఆలస్యమవుతుందంటున్నారు. ‘పాలు, జ్యూస్‌లు, కూల్ డ్రింకులు, లిక్కర్‌తో మందులు వేసుకుంటే వాటి ప్రభావం తగ్గుతుంది. మాత్రలను పొడి చేయడం, నీళ్లలో కలపడం లాంటివి చేయొద్దు. దీనివల్ల ఒకేసారి మందు విడుదలై ప్రమాదకరంగా మారొచ్చు’ అని చెబుతున్నారు.

News April 17, 2026

ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: VZM కలెక్టర్

image

ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సీఐటీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News April 17, 2026

NZB: కొనుగోళ్ల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

జిల్లాలో యాసంగి సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం, పసుపు, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం, మొక్కజొన్న, పసుపు విక్రయాలకు సంబంధించి 08462-220183 నంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు.