News February 13, 2026

పట్టణాల్లో ‘హ్యాపీ సండే’

image

AP: పట్టణ ప్రజల్లో ఆరోగ్యవంతమైన జీవనశైలిని పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా హ్యాపీ సండే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ప్రతి నెలా 2, 4వ ఆదివారాల్లో ఉదయం రెండు గంటలపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. యోగ, ఫిట్‌నెస్ సెషన్లు, క్రీడా పోటీలు, సృజనాత్మక చర్చల అమలుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Similar News

News April 19, 2026

‘ప్రాజెక్ట్ పునర్విక’.. మంత్రి లోకేశ్ కీలక ప్రకటన

image

AP: అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లలకు వైద్య సాయం అందించేందుకు మంత్రి లోకేశ్ ‘ప్రాజెక్ట్ పునర్విక’ను ప్రకటించారు. చిన్నారి <<19682330>>పునర్వికకు<<>> ₹16Cr ఇంజెక్షన్ ఇస్తుండగా చూడటం తన జీవితంలోని భావోద్వేగ క్షణాల్లో ఒకటని Xలో <>పోస్ట్<<>> చేశారు. ‘ఇలా అరుదైన సమస్యలతో బాధపడే పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ వ్యాధులకు చికిత్స సులభతరం అయ్యేలా, ఖర్చులు తగ్గేలా కేంద్రం, ఫార్మా కంపెనీలు, డాక్టర్లతో కలిసి పని చేస్తా’ అని తెలిపారు.

News April 19, 2026

ఆహారాన్ని వేగంగా తింటున్నారా?

image

ఉరుకులు పరుగుల జీవితంలో చాలామందికి తినడానికి టైమ్ దొరకట్లేదు. వేగంగా తినడం వల్ల కడుపు నిండిందనే సిగ్నల్ బ్రెయిన్‌కు వెళ్లడం ఆలస్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎక్కువగా తినేస్తే బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ‘ఆహారాన్ని సరిగ్గా నమలకపోవడం వల్ల జీర్ణసమస్యలు వస్తాయి. ఇలాగే ఎక్కువ రోజులు కొనసాగితే కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి సమస్యలు వస్తాయి’ అని పేర్కొంటున్నారు.

News April 19, 2026

విజయ్‌తో విడాకులు.. రూ.250 కోట్లు కోరిన సంగీత?

image

TVK చీఫ్ విజయ్, సంగీత విడాకులు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. పరస్పర అంగీకారంతో విడిపోవడానికి లాయర్ల సమక్షంలో ఇటీవల చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే కోర్టులో విచారణ జరగనుంది. సెటిల్మెంట్ కింద రూ.250 కోట్లు కావాలని సంగీత కోరగా రూ.35 కోట్లను విజయ్ ప్రతిపాదించినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని ఆయన చెప్పినట్లు పేర్కొంటున్నాయి.