News February 13, 2026

సంగారెడ్డి: మద్యం దుకాణాల బంద్

image

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో నేడు జరుగనున్న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల పరిధిలోని ప్రాంతాలలో మద్యం దుకాణాలు మూసివేయాలని అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Similar News

News April 17, 2026

సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానమిదే!

image

APలో జనగణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రారంభమైంది. ప్రజలు se.census.gov.in పోర్టల్‌లో ఇంటిపెద్ద పేరు, మొబైల్ నంబర్, OTPతో లాగిన్ అయి జిల్లా, పిన్ కోడ్, గ్రామం/ పట్టణం వివరాలివ్వండి. మ్యాప్‌లో ఇంటి లొకేషన్ గుర్తించి, అడిగిన ప్రశ్నలన్నీ పూర్తి చేయాలి. ‘Final Submit’ చేయగానే Hతో మొదలయ్యే 11 అంకెల SE ID వస్తుంది. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఈ ఐడీని చూపిస్తే సరిపోతుంది. ఈనెల 30 వరకూ చేయవచ్చు.

News April 17, 2026

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కలెక్టర్

image

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ప్రగతి ప్రణాళికలో భాగంగా ఖమ్మం RTO కార్యాలయంలో నిర్వహించిన “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్‌లో ఆసుపత్రికి తరలించిన వారికి రాహ-వీర్ పథకం క్రింద రూ.25 వేలు ప్రోత్సాహకంగా అందజేస్తామని చెప్పారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించడం మన రక్షణ కోసమేనన్నారు.

News April 17, 2026

సూర్యాపేటలో ఉమ్మడి జిల్లా చెస్ పోటీలు

image

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి చెస్ ఎంపిక పోటీలు ఏప్రిల్ 19న సూర్యాపేట టీటీడీ కళ్యాణ మండపంలో జరగనున్నాయి. అండర్ 7, 11, 19 విభాగాల్లో బాలురు, బాలికలకు ఈ పోటీలు నిర్వహిస్తారు. ఎఫ్ఐడీఈ (FIDE) నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వివరాల కోసం 9394753343 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.