News May 1, 2024

T20WC: అఫ్గానిస్తాన్ టీమ్ ఇదే

image

టీ20 వరల్డ్‌కప్ కోసం అఫ్గానిస్తాన్ జట్టును ప్రకటించింది. ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లతో కలిపి 18 మందికి చోటు కల్పించింది.
టీమ్: గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్, నజీబుల్లా జర్దాన్, మహమ్మద్ ఇషాక్, ఒమర్జాయ్, నబి, నయిబ్, కరీం జనత్, రషీద్ ఖాన్, ఖరొటి, ముజీబ్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫరూఖీ, ఫరీద్ అహ్మద్.
రిజర్వ్: అటల్, హజర్తుల్లా, సలీమ్ సఫీ.

Similar News

News March 14, 2026

FIFA WC, 2028 ఒలింపిక్స్‌కు నో ఎంట్రీ.. ట్రంప్‌కు షాక్ తప్పదా?

image

USలో ఈ ఏడాది జరిగే FIFA WC, 2028 LA ఒలింపిక్స్‌కు ట్రంప్‌ను, ప్రభుత్వ అధికారులను నిషేధించాలని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(WADA) యోచిస్తున్నట్లు సమాచారం. 2023 నుంచి తమకు చెల్లించాల్సిన $7.3 మిలియన్లను US పెండింగ్‌లో ఉంచడమే కారణమని తెలుస్తోంది. 2014 సోచి వింటర్ ఒలింపిక్స్‌లో రష్యన్, 2024లో చైనా అథ్లెట్లు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినప్పటికీ నిర్దోషులుగా తేల్చడంతో WADA, US మధ్య విభేదాలు ముదిరాయి.

News March 14, 2026

మళ్లీ వర్షాలు!

image

ఎండలతో అల్లాడిపోతున్న తెలుగు ప్రజలకు కాస్త ఊరట కలగనుంది. ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి పలు జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-50KM వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 18, 19, 20 తేదీల్లో HYD, ఉ.గోదావరి, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, నెల్లూరు జిల్లాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

News March 14, 2026

‘శల్య సారథ్యం’ అంటే?

image

ఒకరిని నమ్మి కీలక బాధ్యతలు అప్పగిస్తే ప్రత్యర్థికి మేలు చేసేలా వ్యవహరించినప్పుడు ఈ జాతీయం వాడుతుంటారు. భారతంలో పాండవులకు శల్యుడు మేనమామ. అయితే దుర్యోధనుడు కుట్రతో చేసిన సత్కారానికి మెచ్చి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులకు సాయం చేయడానికి ఒప్పుకుంటారు. తర్వాత నిజం తెలుసుకొని ధర్మరాజు వినతితో కర్ణుడి రథసారథిగా ఉంటూ సూటిపోటి మాటలతో అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఓటమికి కారణమవుతారు.
<<-se>>#EPICSAYINGS<<>>