News February 13, 2026

నిజామాబాద్, కరీంనగర్ మేయర్ పీఠాలు ఎవరికో?

image

TG: నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ముస్లింలు పెద్దసంఖ్యలో ఉండటంతో MIM సత్తా చాటే అవకాశం ఉంది. అయితే ఏ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీంతో MIM మద్దతుతో మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. BRS, స్వతంత్రులు కీలకంగా మారే ఛాన్సుంది.

Similar News

News April 16, 2026

పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టే 3 బిల్లులు ఇవే..

image

1. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు-2026: ఢిల్లీ, J&K, పుదుచ్చేరిలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన. ఇందులోనే మహిళా రిజర్వేషన్ల అమలు.
2. రాజ్యాంగ(131వ) సవరణ బిల్లు: LS, అసెంబ్లీ స్థానాల్లో 33% మహిళా రిజర్వేషన్లు తక్షణమే అమలు. MP స్థానాలను 850కి పెంచడం.
3. డీలిమిటేషన్ బిల్లు-2026: కొత్తగా పెరిగే సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల సరిహద్దులను నిర్ణయించేందుకు కమిషన్ ఏర్పాటు.

News April 16, 2026

BREAKING: లోక్‌సభలో డీలిమిటేషన్ బిల్లు.. వాడీవేడీ చర్చ

image

లోక్‌సభలో మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ డీలిమిటేషన్ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చారు. దీనిని చర్చకు అనుమతించడంపై కేంద్ర మంత్రులు, ప్రతి‌పక్ష ఎంపీల మధ్య వాడీవేడీగా చర్చ జరుగుతోంది. మొత్తం మూడు బిల్లులపై లోక్‌సభలో 18 గంటలు, రాజ్యసభలో 10 గంటలపాటు చర్చ, ఆపై ఓటింగ్ జరగనుంది.

News April 16, 2026

IPL: ఇదేం రూల్ సార్..

image

నిన్న LSGతో మ్యాచులో RCB బౌలర్ హేజిల్‌వుడ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వడంపై కొందరు IPL ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. అతడు తీసింది ఒకే ఒక్క వికెట్. కానీ మరో బౌలర్ రసిఖ్ దార్ 4 వికెట్లు పడగొట్టారు. అయితే హేజిల్‌వుడ్ కంటే అతడు 4 పరుగులు ఎక్కువ ఇచ్చారు. అతడి ఎకానమీ 6 కాగా హేజిల్‌వుడ్‌ది 5. దీంతో POTMకు ఇదే కొలమానమా? వికెట్లు తీయాల్సిన అవసరం లేదా? అని కొందరు BCCIని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?