News February 13, 2026

WGL: మున్సిపాలిటీలో వారి ఓట్లే కీలకం!

image

ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16న నిర్వహించనున్న ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. కాంగ్రెస్‌కు 11 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు, ఒక ఎమ్మెల్సీ బలం ఉండగా, బీఆర్ఎస్ తరఫున ముగ్గురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మ్యాజిక్ ఫిగర్ దక్కని చోట ఈ ఓట్లే గెలుపోటములను శాసించనున్నాయి.

Similar News

News April 18, 2026

VZM: పైడితల్లమ్మ ఆలయం పనులు.. ఉత్తరాయణలోనే ప్రారంభించేలా చర్యలు

image

విజయనగరం పైడితల్లమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. దేవాలయ ప్రాంగణం విస్తరణ, క్యూలైన్ వ్యవస్థ మెరుగుదల, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఉత్తరాయణ కాలంలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 18, 2026

యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం

image

మేడారంలో రాతి కట్టడం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి కాలును కోల్పోయిన బాలుడు యువిన్ తల్లి స్వప్నకు దేవాదాయ శాఖలో ఉద్యోగం ఇచ్చారు. ఈ మేరకు మంత్రి సీతక్క ఆమెకు ములుగు కలెక్టరేట్‌లో నియామక పత్రం అందజేశారు. బాలుడి పేరిట ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తామని, వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ కళ్యాణి పాల్గొన్నారు.

News April 18, 2026

బాపట్ల: యాక్సిడెంట్.. ఇద్దరి స్పాట్ డెడ్ మృతి

image

కారంచేడు మండలం స్వర్ణ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. దగ్గుబాడు నుంచి స్వర్ణ వైపు వస్తున్న ఆటో, స్వర్ణ నుంచి దగ్గుబాటి వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై పయనిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.