News February 13, 2026

అనకాపల్లి: శివరాత్రికి శైవ క్షేత్రాలకు నడిచే బస్సులు ఎన్ని అంటే?

image

అనకాపల్లి, నర్సీపట్నం ఆర్టీసీ డిపోల నుంచి శైవ క్షేత్రాలకు 95 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణాశాఖ(ఆర్టీసీ) అధికారిణి ప్రవీణ తెలిపారు. గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రావికమతం మండలం కళ్యాణపులోవ, గొలుగొండ మండలం దారమఠం, విజయనగరం జిల్లా పుణ్యగిరి శైవక్షేత్రాలకు ఈ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

Similar News

News April 6, 2026

కడప జిల్లా పోలీస్ PGRSకు 114 ఫిర్యాదులు

image

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు సోమవారం 114 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదు దారులతో ఆయన స్వయంగా మాట్లాడి పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేశారు. చట్ట పరిధిలో బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఎవరైనా తమ సమస్యలను విన్నవించుకోవచ్చని చట్ట పరిధిలో వారికి న్యాయం చేస్తామని తెలిపారు.

News April 6, 2026

బాపట్ల కలెక్టరేట్‌కు 15 ఎకరాలు

image

బాపట్ల కలెక్టరేట్ నూతన భవన నిర్మాణం కోసం 15 ఎకరాల స్థలాన్ని అధికారులు సిద్ధం చేశారు. సోమవారం మంత్రి పార్థసారథి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 10 ఎకరాలకు బదులు 15 ఎకరాలు కేటాయించాలని సూచించారు. భవన నమూనా చిత్రాలు, స్థల వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి.

News April 6, 2026

గడువులోగా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదులను ప్రత్యేక శ్రద్ధతో నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS 263, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 141 వినతులను స్వీకరించారు. రీఓపెన్ అయిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.