News February 13, 2026
నిర్మల్: LOVE FAILURE.. ఇంటర్ విద్యార్థిని సూసైడ్

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక భైంసాలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన రమేశ్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో బుధవారం ఇంట్లో ఉరేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News March 10, 2026
కృష్ణా: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత BUS సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి అల్ట్రా పల్లెవెలుగు, పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఎటువంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు.
News March 10, 2026
NZB: ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంది: TPCC చీఫ్

ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం నగరంలోని ఖిలా రోడ్‌లో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన అధికారిక ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మైనారిటీల కోసం విద్య, ఉపాధి రంగాల్లో అనేక పథకాలను, షాదీ ముబారక్’ పథకాన్ని పకడ్బందీగా అమల చేస్తోందన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.
News March 10, 2026
ఇకపై రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో పీజీఆర్ఎస్: కలెక్టర్

ఇకపై ప్రతి సోమవారం ఒక్కో రెవెన్యూ డివిజన్ కేంద్రాలలో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించినున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రానికి తమ సమస్యలు తెలుపుకోడానికి సుదూర ప్రాంత ప్రజలు రావడానికి ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏఏ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు ఉన్నాయో గుర్తించి వాటిని పరిష్కరించటమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు.


